- Home
- tollywood
డబ్బింగ్ చెప్పుకుంటున్న సమంత
సమంత ఇంకా ఏమాత్రం తరగని గ్లామర్ తో సినిమాలలో నటిస్తూనే వుంది. అక్కినేని వారి కోడలుగా ఓపక్క కాపురాన్ని చక్కబెట్టుకుంటూనే.. మరోపక్క సినిమాలలో నటిస్తూ తాజాగా వస్త్ర వ్యాపారంలోకి కూడా దిగింది. తాజాగా వెబ్ సీరీస్ లో కూడా నటించింది. హిందీలో సక్సెస్ అయిన 'ఫ్యామిలీ మెన్' సీరీస్ సీజన్ 2లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ రూపొందిస్తున్న ఈ వెబ్ సీరీస్ లో ఈ చిన్నది నెగటివ్ షేడ్స్ తో సాగే పాత్రను పోషిస్తోంది. ఇందులో భాగంగా యాక్షన్ దృశ్యాలలో కూడా నటించిందట. మరోపక్క, ఈ సీరీస్ ని వివిధ భారతీయ భాషలలో నిర్మిస్తున్నారు. ఈ సీరీస్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే, ఇప్పటికే దీని స్ట్రీమింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తికాకపోవడంతో వచ్చే నెలకు వాయిదా వేశారట. మరి, ఈ సీరీస్ ద్వారా సమంత ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి!