కొత్త లుక్కులో మహేశ్

Admin 2020-12-07 12:26:32 entertainmen
సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కొత్త లుక్కుపై స్పందించారు. యూత్ ఫుల్ గా ఉన్న మహేశ్ తాజా ఫొటో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. ఆ ఫొటోను ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అవినాశ్ గోవారికర్ క్లిక్ మనిపించారు. దీనిపై మహేశ్ స్పందిస్తూ, అవినాశ్ గోవారికర్ వంటి ప్రతిభావంతుడైన ఫొటోగ్రాఫర్ తీసిన ఛాయాచిత్రాల్లో ఏది ఫేవరెట్ అంటే ఎంచుకోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ఈసారికి ఈ ఫొటోను ఎంచుకుందాం అంటూ వ్యాఖ్యానించారు.