- Home
- tollywood
ఉచితంగా హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేసిన కాజల్
హనీమూన్ కోసం ఆమె భారీగా ఖర్చు చేసిందంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. సాధారణంగా అక్కడి ఓ హోటల్‌లో ఒక్క రాత్రి ఉండాలంటే రూ.38 లక్షలు ఖర్చు అవుతుంది. కాజల్ తన భర్తతో కలిసి 10 రోజులు ఉంది. అందుకోసం ఆమె దాదాపు రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసిందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆమె ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేసినట్లు తెలిసింది. పర్యాటక ప్రదేశాలను ప్రమోట్ చేసుకోవడం కోసం సెలబ్రిటీలకు అక్కడ ఫ్రీగా పర్యటించేందుకు అక్కడి ప్రభుత్వం ఆఫర్ ప్రకటించింది. సెలబ్రిటీలకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే ఈ ఆఫర్ పొందొచ్చు. దీంతో కాజల్ ఉచితంగా హనీమూన్ ఎంజాయ్ చేసిందని తెలిసింది.