- Home
- bollywood
హీరో హృతిక్ రోషన్ పక్కన ఛాన్స్ కియారా అద్వానీకి
బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సరసన అవకాశం రావడం అంటే మాటలు కాదు.. అందులోనూ హ్యాండ్ సమ్ హీరో హృతిక్ రోషన్ పక్కన ఛాన్స్ అంటే మరీనూ. ఇప్పుడు అలాంటి చక్కని అవకాశం కియారా అద్వానీకి లభించినట్టు వార్తలొస్తున్నాయి. పైగా, ప్రతిష్ఠాత్మక 'క్రిష్' సిరీస్ అయిన 'క్రిష్ 4'లో నటించే సదవకాశం ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టు తెలుస్తోంది. కృతి సనన్ ని అనుకున్న మాట నిజమే. ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయి. ఆమె కూడా మొగ్గు చూపింది. అయితే, ఇతర కమిట్ మెంట్స్ తో ఆమె డైరీ నిండివుండడంతో ఆమె డేట్లు సర్దుబాటు చేయలేకపోతోంది. దీంతో కియారాను ప్రస్తుతం సంప్రదించడం జరుగుతోంది' అంటూ హృతిక్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నట్టు బాలీవుడ్ మీడియా పేర్కొంది. మొత్తానికి ఈ ఆఫర్ ఖరారైతే కనుక కియరాకు ఇది బాలీవుడ్ లో మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పచ్చు!