- Home
- tollywood
స్నేహితుడు రజనీకాంత్‌కి 70వ జన్మదిన శుభాకాంక్షలు
సినీనటుడు రజనీకాంత్‌కి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.‘ప్రియమైన స్నేహితుడు రజనీకాంత్‌కి 70వ జన్మదిన శుభాకాంక్షలు. మున్ముందు మీరు మరింత గొప్పగా జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. రాజకీయాల్లో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకమైన మీ స్టైల్‌తో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. అలాగే, అటువంటి ప్రత్యేకమైన మార్గంలోనే నడుస్తూ కోట్లాది మందికి సేవలు అందిస్తారని నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలి’ అని చిరంజీవి పేర్కొన్నారు.