- Home
- tollywood
కరోనా నుంచి కోలుకున్నా.. రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ గత వారం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కరోనా నుంచి కోలుకుంది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. తాజా టెస్టుల్లో కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చాలా బాగున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మంచి ఆరోగ్యంతో, సానుకూల దృక్పథంతో 2021ని ప్రారంభించేందుకు ఆగలేకపోతున్నాను' అంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించింది. అంతేకాదు తన అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అందరూ బాధ్యతగా ఉండాలని, మాస్కులు ధరించి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది.