- Home
- tollywood
'అల్లుడు అదుర్స్' సినిమాలో స్పెషల్ సాంగులో : మోనాల్
'బిగ్ బాస్ 4' రియాలిటీ షోలో ఈ చిన్నది ఒక్కసారిగా మెరిసింది. ఇందులో పార్టిసిపెంట్ గా పాల్గొని అందర్నీ ఆకట్టుకుంది. ఈ షో ఆమెకు మళ్లీ మంచి గుర్తింపును ఇచ్చింది. దాంతో మన దర్శక నిర్మాతల దృష్టిలో మోనాల్ మళ్లీ పడింది. ఈ చిన్నదానికి టాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అల్లుడు అదుర్స్' సినిమాలో స్పెషల్ సాంగులో నటించే చాన్స్ మోనాల్ కు వచ్చినట్టు తెలుస్తోంది.