- Home
- tollywood
వకీల్ సాబ్ సెట్స్ లో ఉల్లాసభరితంగా పవన్ కల్యాణ్
తాజాగా ఈ చిత్రంలో పవన్ పై సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా పవన్ సెట్స్ లో ఉల్లాసంగా గడిపారు. చిత్ర యూనిట్ సభ్యులతో సంతోషాన్ని పంచుకున్నారు. దర్శకుడు వేణు శ్రీరామ్ తోనూ, నిర్మాత దిల్ రాజుతోనూ... ఇతర యూనిట్ సభ్యులందరితోనూ ఫొటోలు దిగారు. బాలీవుడ్ లో హిట్టయిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ రీమేక్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పవన్ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కీలక పాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నటిస్తున్నారు.