- Home
- bollywood
రూ. 4.50 లక్షల ఆసుపత్రి బిల్లు చెల్లించిన సోనూసూద్!
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరోమారు తన మంచి మనసు చాటుకున్నాడు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 15 నెలల వయసున్న చిన్నారి ఆపరేషన్‌కు అవసరమైన రూ. 4.50 లక్షల ఆసుపత్రి బిల్లు చెల్లించాడు. కృష్ణా జిల్లా తిరువూరు మండలంలోని మునుకుళ్లకు చెందిన కొంగల వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతుల కుమార్తె వర్షిత గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. పాపను బతికించుకోవాలంటే ఆపరేషన్ చేయాల్సిందేనని వైద్యులు చెప్పారు. పేద కుటుంబం కావడంతో ఆపరేషన్‌కు అవసరమైన డబ్బులు సమకూర్చుకోవడం వారికి తలకుమించిన భారంగా మారింది. దీంతో జనవిజ్ఞాన వేదిక ప్రతినిధుల ద్వారా చిన్నారి పరిస్థితిని నటుడు సోనూ సూద్ దృష్టికి తీసుకెళ్లారు.