ఐటీ, ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం : శాండల్‌వుడ్ నటి రాధిక

Admin 2021-01-09 11:35:14 entertainmen
రాధిక కుమారస్వామి నిన్న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ఎదుట హాజరయ్యారు. ఓ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడికి, రాధిక మధ్య అక్రమంగా పెద్ద ఎత్తున నగదు బదిలీ అయిందన్న ఆరోపణలపై సీసీబీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. సోదరుడు రవిరాజ్‌తో కలిసి చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి చేరుకున్న రాధికను అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఆరోపణలపై అలియాస్ స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరెస్సెస్ కార్యకర్తగా చెప్పుకుంటూ ఆయనీ మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు నటి రాధిక కుమారస్వామి, యువరాజ్ మధ్య రూ. 75 లక్షల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. సీసీబీ దర్యాప్తునకు హాజరైన రాధిక అనంతరం మాట్లాడుతూ..ఓ సినిమాకు సంబంధించి తన ఖాతాలో రూ. 60 లక్షలు జమ అయినట్టు చెప్పారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యువరాజ్ తనకు గత 17 ఏళ్లుగా తెలుసన్నారు. ఆయన తమ కుటుంబ జ్యోతిష్యుడని చెప్పారు. తన కెరియర్, జీవితం, తన తండ్రి మరణం గురించి ఆయన చెప్పినవన్నీ నిజమయ్యాయని పేర్కొన్నారు. గతేడాది డిసెంబరు 16న యువరాజ్ నివాసంపై దాడులు చేసిన సీసీబీ అధికారులు రూ. 91 కోట్ల విలువైన 100 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.