- Home
- bollywood
నటుడిగా మారిన బోనీ కపూర్..
బోనీ కపూర్ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. చిత్రనిర్మాణంలో కాకలు తీరిన బోనీ కపూర్ ఇప్పుడు నటుడిగా కెమెరా ముందుకు రానున్నారు. లవ్ రంజన్ దర్శకత్వంలో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రంలో బోనీ కపూర్ కీలకపాత్రలో కనిపించనున్నారు. హీరో రణబీర్ కపూర్ కు తండ్రిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. హీరోహీరోయిన్లు రణబీర్, శ్రద్ధాలపై పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే బోనీ కపూర్ కూడా షూటింగ్ కు హాజరవనున్నారు.