ఇది నా‌ మొదటి అడుగు మాత్ర‌మే : అల్లు అర్జున్

Admin 2021-01-12 15:15:14 entertainmen
అల్లు అర్జున్ న‌టించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఆయ‌న కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన‌ ఈ సినిమా విడుదలై నిన్న‌టికి ఏడాది పూర‍్తయింది. ఓ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసుకుని మాట్లాడారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ... గత ఏడాది సంక్రాంతి అనంత‌రం ఏడాది మొత్తం ప్రపంచానికి బ్యాడ్ ఇయర్ గా నిల‌చింద‌ని, త‌నకు మాత్రం అది బ్యాడ్ ఇయ‌ర్ కాద‌ని చెప్పాడు. త‌న కెరీర్ మొత్తంలో ఇటువంటి విజయాన్ని తాను అందుకోలేద‌ని తెలిపాడు. ఏడాది గ‌డుస్తున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ ఏదో ఒక విధంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూనే ఉందని ఆయ‌న తెలిపాడు. అందుకే 2020 తనకు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకమని చెప్పాడు. తమన్ ఎంతో గొప్ప పాటలు అందించాడని తెలిపాడు. ఒకవేళ సినిమాను సంక్రాంతికి కాకుండా సమ్మర్ లో విడుదల చేసి ఉంటే ఈ స్థాయిలో విజయాన్ని అందుకొని ఉండేది కాదేమోన‌ని బ‌న్నీ అన్నాడు. త‌న‌కు 20 సినిమాల సమయం పట్టిందని చెప్పాడు. అయితే, ఇది త‌న‌ మొదటి అడుగు మాత్ర‌మేన‌ని, ఇకపై తానేంటో చూపిస్తాన‌ని తెలిపాడు.