- Home
- bollywood
టాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం
సోనూసూద్ : తన మొదటి ప్రాధాన్యత తెలుగు పరిశ్రమకేనని సినీ నటుడు సోనూసూద్ అన్నాడు. ‘అల్లుడు అదుర్స్’ సినిమా సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ... సినిమాకు సంబంధించిన చాలా విషయాలను తాను టాలీవుడ్ నుంచే నేర్చుకున్నానని తెలిపాడు.తన భార్య తెలుగు ప్రాంతానికి చెందిన మహిళ అని చెప్పాడు. బెల్లంకొండ సురేశ్ ఏదైనా సినిమాలో పాత్ర ఉందని ఫోన్ చేస్తే వచ్చేస్తానని చెప్పాడు. ‘అల్లుడు అదుర్స్ సినిమాలో తనకు మంచి పాత్ర ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే, బెల్లంకొండ శ్రీనివాస్ మంచి మనసున్న వ్యక్తని సోనూసూద్ ప్రశంసించాడు.