బిగ్ బాస్ తమిళ సీజన్ 4 విజేతగా నటుడు ఆరి అర్జున!

Admin 2021-01-18 12:25:14 entertainmen
105 రోజులుగా తమిళ బుల్లి తెర వీక్షకులను అలరించిన బిగ్ బాస్ సీజన్-4 ముగిసింది. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో నటుడు ఆరి అర్జున విజయం సాధించినట్టు హోస్ట్ కమలహాసన్ ప్రకటించారు. ఆపై బిగ్ బాస్ ట్రోఫీని, రూ. 50 లక్షల నగదు బహుమతిని కమల్ అతనికి అందించారు.