- Home
- tollywood
కరోనా తర్వాత దూకుడు పెంచిన రకుల్
కరోనా నుంచి కోలుకున్న తర్వాత పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ దూకుడు పెంచింది. రెగ్యులర్ గా షూటింగ్ లకు హాజరవుతోంది. తాజాగా తమిళంలో 'అయలాన్' సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివకార్తికేయన్ పై రకుల్ ప్రశంసలు కురిపించింది. కార్తికేయన్ తో కలసి నటించడం సంతోషాన్నిచ్చిందని చెప్పింది. ఆయన చాలా మంచి యాక్టర్ అని కితాబునిచ్చింది. డైలాగ్స్ ను తమిళంలో ఎలా పలకాలో తనకు నేర్పించాడని చెప్పింది. తనకు కావాల్సిన ఆహారం చెన్నైలో ఎక్కడ దొరుకుతుందో చెప్పేవాడని తెలిపింది. షూటింగ్ సమయంలో ఆయనతో ఒక డీల్ కుదుర్చుకున్నానని... సెట్స్ లో ఉన్నంత కాలం తనతో ఆయన ఇంగ్లిష్ లో మాట్లాడాలి...