పెళ్లి పీటలు ఎక్కబోతున్న సుమంత్ అశ్విన్

Admin 2021-02-03 20:54:35 entertainmen
టాలీవుడ్ యంగ్ హీరోలందరూ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు కుమారుడు హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. పెళ్లికూతురు వాళ్ల బంధువుల అమ్మాయే. పెళ్లికూతురు పేరు దీపిక. అమెరికాలోని డల్లాస్ లో ఆమె ఎమ్మెస్ చేశారు. ఈ నెల 13న హైదరాబాద్ శివార్లలో వీరి పెళ్లి జరగనుంది. కరోనా నేపథ్యంలో, వివాహం కేవలం ఇరు కుటుంబాల సమక్షంలో జరుగుతున్నట్టు సమాచారం.