- Home
- tollywood
నెటిజన్‌పై యాంకర్ అనసూయ మండిపడుతూ ట్వీట్లు
ఓ నెటిజన్‌పై యాంకర్ అనసూయ మండిపడుతూ ట్వీట్లు చేసింది. దాదాపు మూడేళ్ల క్రితం అనసూయ ఓ షోలో యాంకరింగ్ చేస్తూ కళ్లు తిరిగి పడిపోయింది.ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ పలు ఆరోపణలు చేశాడు. ఈ షో పబ్లిసిటీ కోసమే అనసూయ అలా కళ్లు తిరిగిపడిపోయినట్లు నటించిందని చెబుతూ అసభ్యకరంగా ఓ కామెంట్ చేశాడు. ఆమె కూడా అసభ్యపదజాలం వాడుతూ అతడిని తిడుతూ పోస్ట్ చేసింది. ఇటువంటి కామెంట్ చేయడం చాలా తేలికని చెప్పింది. తనకు లోబీపీ ఉందని, అప్పట్లో తాను 22 గంటలపాటు నిర్విరామంగా షూట్‌లో పాల్గొన్నానని చెప్పింది.5.30 గంటలకు ఆ ఘటన జరిగిందని వివరించింది. దానిని వేరేలా అర్థం చేసుకుంటున్నారని, ఏం జరిగిందో పూర్తిగా తెలియకుండానే తనపై ఎలా కామెంట్ చేస్తావు? అంటూ ఆ నెటిజన్ ను అనసూయ నిలదీసింది.