- Home
- tollywood
పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను కొనసాగిస్తున్న కాజల్
భామ కాజల్ అగర్వాల్ ఇటీవలే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. హానీమూన్ సందర్భంగా తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి దిగిన ఫొటోలను అప్పట్లో ఆమె షేర్ చేసింది.ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.పెళ్లి చేసుకున్నప్పటికీ తన కెరీర్ ని కొనసాగించేందుకు ఆమె నిర్ణయించుకుంది. తన కుటుంబ జీవితాన్ని, షూటింగులను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కాజల్ తన పేరును మార్చుకుంది. తన భర్త పేరు కలిసి వచ్చేలా 'కాజల్ ఎ కిచ్లు' అని మార్చేసుకుంది. తన పేరు వెనుక భర్త పేరు వచ్చేలా ఇన్ స్ట్రాగ్రామ్ ప్రొఫైల్ లో మార్పులు చేసింది.