- Home
- tollywood
పుష్ప : రష్మిక మేకప్ కోసం రెండు గంటలు
'పుష్ప' అవుట్ డోర్ షూటింగులో చాలా కష్టపడుతున్నానని అంటోంది అందాలభామ రష్మిక.షూటింగ్ గత కొన్నాళ్లుగా అవుట్ డోర్ లొకేషన్స్ లో జరుగుతోంది. దీనిపై అక్కడ తన అనుభవాన్ని రష్మిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దూర ప్రాంతాలలో షూటింగ్ చేయడం వల్ల కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నాను. మా బస నుంచి షూటింగ్ లొకేషన్ చాలా దూరం కావడంతో తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేవాల్సి వస్తోంది. ఇక షూటింగ్ పూర్తిచేసుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అవుతోంది. అల్లు అర్జున్ తో పనిచేయడం స్పెషల్ గా ఉందనీ, ఆయన నుంచి ఎన్నో నేర్చుకుంటున్నాననీ రష్మిక చెప్పింది. బన్నీ మంచి మనసున్న మనిషని కితాబునిచ్చింది.