గోపీచంద్ తో రాశికి మూడో సినిమా

Admin 2021-02-11 12:14:35 entertainmen
మారుతి, కథానాయిక రాశీఖన్నా కాంబినేషన్ కూడా అలాగే మళ్లీ వస్తోంది. గత సంవత్సరం వీరి కాంబినేషన్లో 'ప్రతిరోజూ పండగే' వంటి విజయవంతమైన సినిమా వచ్చింది. గోపీచంద్ కథానాయకుడుగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రానున్న సంగతి మనకు తెలిసిందే. యూవీ క్రియేషన్స్, జీఏ 2 సంస్థలు కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి 'పక్కా కమర్షియల్' అనే వెరైటీ టైటిల్ని కూడా ఇప్పటికే నిర్ణయించారు. గోపీచంద్, రాశీఖన్నా కాంబినేషన్ కు ఇది మూడో చిత్రం. గతంలో వీరిద్దరూ కలసి 'జిల్', 'ఆక్సిజన్' చిత్రాలలో నటించారు.