- Home
- tollywood
లాక్ డౌన్ సమయంలో దూరంగా ఉండటంతో పెరిగిన ప్రేమ
కాజల్ అగర్వాల్... గత సంవత్సరం తాను వలచిన గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుని కాజల్ కిచ్లూగా మారిపోయింది. తనను కాఫీ తాగేందుకు వస్తావా? అని అడిగేందుకే గౌతమ్ కు రెండు రోజులు పట్టిందని మురిపెంగా చెప్పుకొచ్చింది. అంతవరకూ అతనెవరో తనకు తెలియలేదని, ఎంతో తక్కువ టైమ్ లోనే తనకు మంచి స్నేహితుడిగా మారిన వ్యక్తి గౌతమ్ అని పేర్కొంది.పెళ్లి గురించి తనకు నమ్మకం ఉండేది కాదని, ఆ విషయం గమనించిన గౌతమ్, తన కోసం ఎంతో వేచి చూశాడని కాజల్ వ్యాఖ్యానించింది. ఫ్రెండ్స్ గా ఉన్న తామిద్దరి మధ్యా ప్రేమ ఎప్పుడు పుట్టిందో కూడా తనకు తెలియదని చెప్పింది. కొన్ని వారాల తరువాత తామిద్దరమూ మాస్క్ లు ధరించి, ఓ దుకాణంలో కలిశామని, అప్పుడే తమ మధ్య ఎంత ప్రేమ ఉందో తెలిసిపోయిందని, తమ మనసులు జీవితాంతం కలిసుండాలని కోరుకుంటున్నాయని అనిపించిందని తెలిపింది. "నీతో కలిసి ఏడడుగులు నడిచి, జీవితాన్ని గడపాలని ఉంది" అని గౌతమ్ ఎంతో భావోద్వేగంతో చెప్పగానే, ఇంతకన్నా మంచివాడు దొరకడన్న భావానికి వచ్చేశానని, ఆపై వివాహ బంధంతో ఇద్దరమూ ఒకటయ్యామని తెలిపింది.