కృష్ణవంశీ తదుపరి సినిమాలో జాన్వీకపూర్

Admin 2021-02-17 12:05:35 entertainmen
ఇటీవల జాన్వీకపూర్ నటించిన 'గుంజన్ సక్సేనా' సినిమా నటిగా ఆమెకు మరింత పేరును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె హిందీలో 'గుడ్ లక్ జెర్రీ', 'దోస్తానా 2' చిత్రాలలో నటిస్తూ బాలీవుడ్ లో బిజీగా వుంది. జాన్వీని తెలుగు సినిమాలో నటింపజేయడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంచి ఆఫర్ వస్తే తన కూతుర్ని టాలీవుడ్ కి పరిచయం చేయాలని తండ్రి బోనీకపూర్ కూడా చూస్తున్నారు. కృష్ణవంశీ తన తదుపరి సినిమాను మహిళా ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో జాన్వీని కథానాయికగా తీసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారట. కథను కూడా జాన్వీని దృష్టిలో పెట్టుకునే ఆయన తయారుచేశారట.