ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కమల్

Admin 2021-02-20 19:03:35 entertainmen
సూపర్ స్టార్ రజనీకాంత్ ను సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ కలిశారు. తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని రజనీకాంత్ ప్రకటించిన తర్వాత ఆయనను కమల్ కలవడం ఇదే తొలిసారి. రజనీకాంత్ ను కమల్ కలవడం తమిళనాట సంచలనంగా మారింది. రజనీ మద్దతు కోరేందుకు కలిశారా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కమల్ సన్నిహితులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య రాజకీయాలు చర్చకు రాలేదని వారు తెలిపారు. 2018లో మక్కల్ నీధి మయ్యమ్ పార్టీని కమల్ ప్రారంభించారు.