షాహిద్ కపూర్ సరసన రాశిఖన్నా

Admin 2021-02-27 12:06:19 entertainmen
రాశిఖన్నా ఇప్పుడు కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోను కూడా ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం తాను నటిస్తున్న ఓ వెబ్ సీరీస్ కోసం రాశి ఇలా కిక్ బాక్సింగ్ నేర్చుకుంటోంది. రాశిఖన్నా కూడా ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సీరీస్ చేస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సరసన ఆమె జంటగా నటిస్తోంది. ఈ సీరీస్ కోసమే తాను కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందని రాశి తాజాగా పేర్కొంది.