బాబుకి తల్లిగా కనిపించే హీరోయిన్ పాత్రలో : త్రిష

Admin 2020-08-27 15:50:41 entertainmen
'జెర్సీ' చిత్రం మంచి హిట్టయింది. దీంతో హిందీ, తమిళ భాషల్లోకి ఇది రీమేక్ అవుతోంది. హిందీలో ఈ చిత్రాన్ని షాహిద్ కపూర్ హీరోగా పునర్నిర్మిస్తున్నారు. ఇక తమిళ వెర్షన్ లో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో హీరోయిన్ పాత్ర పోషించడానికి ప్రముఖ తారలు ఎవరూ మొదట్లో ఆసక్తి చూపలేదు. దానికి కారణం, ఇందులో కథానాయిక ఓ బాబుకి తల్లిగా కనపడాలి. దాంతో పాత్ర బాగున్నప్పటికీ.. నయనతార, అమలాపాల్ వంటి హీరోయిన్లు వెనుకంజ వేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ పాత్ర చేయడానికి త్రిష ముందుకు వచ్చినట్టు సమాచారం. ఆమెకు పాత్ర బాగా నచ్చడంతో ఇంకేమీ ఆలోచించకుండా ఒప్పేసుకుందట.