ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ చంద్ర తెరంగేట్రం

Admin 2021-03-16 15:44:19 entertainmen
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ చంద్ర టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తారక్ భార్య లక్ష్మీప్రణతి తమ్ముడే నితిన్ చంద్ర కావడం గమనార్హం. ఉదయ్ కిరణ్, నితిన్ లాంటి హీరోలను వెండి తెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజనే నితిన్ చంద్రను కూడా హీరోగా లాంచ్ చేస్తున్నారు. అయితే నితిన్ చంద్ర ఎంట్రీ వెనుక జూనియర్ ఎన్టీఆర్ ప్రోద్బలం ఎంత మేరకు ఉందనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కోసం నితిన్ చంద్ర నటనలో శిక్షణ తీసుకున్నాడు. తేజ తెరకెక్కిస్తున్న ఈ సినిమా 'చిత్రం' సినిమాకు సీక్వెల్ అని తెలుస్తోంది.