రియాకు బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎన్‌సీబీ

Admin 2021-03-16 15:55:19 entertainmen
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రేయసి, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. ఈ కేసులో కొంతకాలంపాటు జైలులో ఉన్న రియాచక్రవర్తికి బాంబే హైకోర్టు గతేడాది అక్టోబరు 7న లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసింది. రియా బెయిలును రద్దు చేయాలంటూ తాజాగా మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్‌సీబీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.