- Home
- tollywood
పవన్ నటన చాలా పవర్ ఫుల్ : మహేశ్ బాబు పొగడ్తల వర్షం
సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'పై టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించిన ఆయన, లాయర్ గా పవన్ చాలా బాగా నటించారని, ఆయన నటన చాలా పవర్ ఫుల్ గా ఉందని అన్నారు. మరోసారి తెరపైకి తెచ్చారని, నివేద, అంజలి, అనన్యలు మనసులను హత్తుకునేలా సినిమాలో లీనమయ్యారని అన్నారు.తమన్ తన సంగీతంతో చిత్రాన్ని ఇంకో మెట్టు ఎక్కించారని కితాబిచ్చారు. కాగా, వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన తరువాత, సోషల్ మీడియా వేదికగా, పలువురు ప్రముఖులు సినిమా యూనిట్ ను ప్రశంసిస్తూ, అభినందనలు తెలిపారు.