బన్నీ కోసం ట్రై చేస్తున్న 'దిల్' రాజు!

Admin 2021-04-15 12:17:39 entertainmen
దిల్ రాజు - వేణు శ్రీరామ్ కలిసి 'వకీల్ సాబ్' సక్సెస్ ను అందుకున్నారు. ఈ సినిమా చూసినవాళ్లకి వేణు శ్రీరామ్ టాలెంట్ పై నమ్మకం కుదిరింది. అయితే 'పుష్ప' తరువాత కొరటాల శివతో సినిమా చేయాలని బన్నీ అనుకున్నాడు. కానీ 'ఆచార్య' తరువాత కొరటాల శివ .. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. దాంతో గతంలో ఆరంభంలోనే ఆగిపోయిన 'ఐకాన్' ప్రాజెక్టును మళ్లీ మొదలుపెట్టాలనే ఆసక్తితో దిల్ రాజు ఉన్నాడట. బన్నీని ఒప్పించి ఆయన డేట్స్ తీసుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడని అంటున్నారు.