'ఆచార్య'లో భారీ యాక్షన్ సీన్లు

Admin 2021-04-15 12:39:21 entertainmen
కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో చరణ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. 'సిద్ధ' అనే పవర్ఫుల్ పాత్రలో ఆయన కనిపించనున్నాడు. ముఖ్యంగా ఆయనపై డిజైన్ చేసిన 'రెయిన్' ఫైట్, వీలైనన్ని విజిల్స్ ను కలెక్ట్ చేసేలా ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇంతవరకూ తెరపై చూసిన రెయిన్ ఫైట్ల కంటే కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా ఈ యాక్షన్ సీన్ ఉంటుందని చెబుతున్నారు. చిరంజీవి - రెజీనా బృందంపై చిత్రీకరించిన ఐటమ్ సాంగ్ .. చరణ్ - పూజా హెగ్డే పై షూట్ చేసిన మెలోడీ సాంగ్ మెగా అభిమానులను హుషారెత్తిస్తాయని చెబుతున్నారు. ఇప్పటి వరకూ హిట్ మాటే వింటూ వచ్చిన కొరటాల, 'ఆచార్య'తో మరో హిట్ ను తన ఖాతాలో జమ చేసుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.