- Home
- sports
విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ ల కలయికే రిషబ్ పంత్
ఐపీఎల్ 14వ సీజన్ లో తొలి మ్యాచ్ లో సీఎస్కేను ఓడించిన ఢిల్లీ కాపిటల్స్, తన తదుపరి మ్యాచ్ ని రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు యువ ఆటగాడు రిషబ్ పంత్ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో డీసీకి చీఫ్ కోచ్ గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంత్ లో తనకు ఇద్దరు ఆటగాళ్లు కనిపిస్తున్నారని విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ ల కలయికే, రిషబ్ పంత్ అని పొగడ్తల వర్షం కురిపించాడు. కోహ్లీలోని దూకుడు, విలియమ్సన్ లోని నాయకత్వ లక్షణాలు పంత్ లో ఉన్నాయని కితాబునిచ్చాడు. జట్టులోకి కీపర్ గా వచ్చిన పంత్ కొన్నిసార్లు తప్పులు చేస్తున్నాడని, ఈ విషయంలో మాత్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సలహా ఇచ్చాడు. బ్యాటింగ్ పరంగా అద్భుతమైన ఫుట్ వర్క్ పంత్ సొంతమని, కీపింగ్ విషయంలోనూ నైపుణ్యాన్ని పెంచుకుంటే, కనీసం మరో పది లేదా పన్నెండేళ్లు భారత జట్టుకు ప్రధాన వికెట్ కీపర్ గా మారే అవకాశాలు ఉన్నాయని అన్నాడు.