- Home
- tollywood
చారిత్రక అంశంతో రూపొందుతున్న 'ఆర్ ఆర్ ఆర్'
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ .. చరణ్ ప్రధానమైన పాత్రధారులుగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనుకోని అవాంతరాల కారణంగా అప్పుడప్పుడూ షూటింగు ఆగుతూ .. విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. అలియా భట్ .. ఒలీవియా ఈ సినిమాలో కథానాయికల పాత్రల్లో కనిపించనున్నారు. ముందుగా ఈ సినిమాను జూలై 30 - 2020న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగుకు అంతరాయం ఏర్పడింది. ఆ తరువాత ఈ ఏడాది జనవరి 30వ తేదీన థియేటర్లకు తీసుకువస్తామని చెప్పారు. కానీ అంతకుందు జరిగిన ఆలస్యం ఈ విడుదల తేదీపై ప్రభావం చూపింది. ఇక ఇదే ఏడాది అక్టోబర్ 13వ తేదీన పక్కా అన్నారు. కానీ ఇప్పుడు ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్లకు రావడం కష్టమనే టాక్ వినిపిస్తోంది.