- Home
- bollywood
కరోనా పేషెంట్ల పాలిట ఆపద్బాంధవుడిగా మారిన సోనూ సూద్
గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచి సినీ నటుడు సోనూ సూద్ పూర్తిగా ప్రజా సేవలోనే నిమగ్నమయ్యారు. వేలాది మందికి ఆయన ఆపద్బాంధవుడిగా నిలిచి, రియల్ హీరో అనిపించుకున్నారు. ఇటీవల కరోనా బారిన పడినప్పటికీ ఆయన తన అపన్న హస్తాన్ని చాచడాన్ని ఆపలేదు. దేశ వ్యాప్తంగా కరోనాతో బాధపడుతున్న పేషెంట్ల కోసం ఆయన రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్క వలస కార్మికుడు తన స్వగ్రామానికి క్షేమంగా, సురక్షితంగా చేరుకునేందుకు తన వంతు ప్రయత్నాన్ని సోను చేశారు. అదేమాదిరి ఇప్పుడు కూడా ప్రతి ఒక్క పేషెంట్ కు బెడ్, ఆక్సిజన్ దొరికేలా కృషి చేస్తున్నారు.