- Home
- tollywood
బలమైన విలన్ పాత్ర ఉంటే చేస్తా: విష్వక్ సేన్
ఫలక్‌నుమా దాస్, హిట్ వంటి చిత్రాలతో సినిమా ప్రేమికుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న యువ హీరో విష్వక్ సేన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హీరోగానే కాకుండా ప్రాధాన్యం ఉంటే విలన్‌గా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. కొత్త హీరో అయినా సరే, బలమైన ప్రతినాయకుడి పాత్ర ఉంటే చేయడానికి ఏమాత్రం వెనుకాడబోనన్నారు.