చిత్ర పరిశ్రమలోని 25 వేల మంది కార్మికులకు ఆర్థికసాయం : సల్మాన్ ఖాన్

Admin 2021-05-07 21:20:21 entertainmen
చిత్ర పరిశ్రమలోని 25 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. సల్మాన్ ఖాన్ మేనేజర్ ఇటీవల సినీ కార్మికుల సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్)ను సంప్రదించి, కార్మికుల బ్యాంకు ఖాతాల వివరాలను కోరారు. సినీ పరిశ్రమలో రోజువారీ వేతనంపై పనిచేసే కార్మికులు ప్రస్తుతం షూటింగ్ లు లేక తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. సల్మాన్ గతేడాది కూడా కరోనా సమయంలో ఇలాగే ఆర్థికసాయం అందించారు.