'ఆదిపురుష్'లో కన్నడ స్టార్ సుదీప్ కీలక పాత్ర

Admin 2021-05-08 12:10:21 entertainmen
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' సినిమాలో కన్నడ స్టార్ హీరో సుదీప్ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఆయన విభీషణుడి పాత్రకు ఎంపికైనట్టు సమాచారం. ఇందులో రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్న సంగతి విదితమే.