- Home
- tollywood
పెళ్లిపీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ ముద్దుగుమ్మ ఛార్మి ?
ఛార్మికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె పెళ్లిపీటలు ఎక్కబోతోందనేదే ఆ వార్త. తన సమీప బంధువును ఛార్మి పెళ్లాడబోతోందట. పెళ్లికి ఛార్మి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మూడు పదుల వయసు దాటినా పెళ్లి చేసుకోవడానికి ఇన్నాళ్లూ ఛార్మి ఇష్టపడని సంగతి తెలిసిందే. తనకు ఎలాంటి తోడు అవసరం లేదని... పెళ్లిపై తనకు నమ్మకం లేదని ఆమె గతంలో పలు మార్లు వ్యాఖ్యానించింది. ఇప్పుడు సడన్ గా పెళ్లికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు అనుష్క, త్రిష వంటివారు నాలుగు పదుల వయసులో ఉన్నారు. వీరి పెళ్లిళ్లకు సంబంధించి అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తున్నా... ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.