ఓటీటీ దిశగా 'సీటీమార్'

Admin 2021-05-08 22:38:21 entertainmen
తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాను క్రితం నెలలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన వాయిదా వేశారు. అయితే ఇక ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేసే పరిస్థితి లేదు. అలా అని చెప్పేసి థియేటర్లు తెరిచే వరకూ ఎదురుచూడటం కూడా కష్టమే. గోపీచంద్ కి కొంతకాలంగా హిట్ లేదు .. అందువలన ఆయన ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. వైవిధ్యభరితంగా సాగే స్పోర్ట్స్ నేపథ్యంలోని కథ కావడం .. భారీ బడ్జెట్ తో నిర్మించడం వలన ఆయన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట. ఇక సంపత్ నంది పరంగా చూసుకుంటే, ఆడియన్స్ తో ఆయనకు చాలా గ్యాప్ వచ్చేసింది. అందువలన ఆయన కసితో చేసిన సినిమా ఇది. ఆయన కూడా థియేటర్ల వైపే చూస్తున్నాడట.