అమ్మ కల తీర్చలేకపోయా : జాన్వీ క‌పూర్

Admin 2021-05-10 11:50:22 entertainmen
త‌న త‌ల్లి త‌న‌ను డాక్టర్‌గా చూడాలని కలలు కన్నదని చెప్పింది. తాను కాలేజీలో చ‌దువుకుంటోన్న రోజుల్లోనూ ఇదే విష‌యాన్ని చెప్పేద‌ని వివ‌రించింది. అయితే, తాను సినీ వాతావరణంలో పెరిగాన‌ని, త‌న బాల్యం నుంచే నటనపై ఆసక్తి కలిగిందని చెప్పింది. త‌న త‌ల్లి శ్రీ‌దేవి కూడా చివరకు త‌న‌ను సినిమాల్లోకి పంప‌డానికి ఒప్పుకుందని వివ‌రించింది. తాను డాక్టర్‌ కావాలనుకున్న అమ్మ కల తీర్చలేకపోయాన‌ని చెప్పింది.