- Home
- tollywood
కొత్త ప్రాజెక్టుకు సన్నాహాలు : అల్లు అర్జున్
అల్లు అర్జున్ ప్ర్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను దసరాకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ల్లు అర్జున్ ఏ దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే విషయంపై అభిమానులు కుతూహలాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఇక మురుగదాస్ ఒక కథను రెడీ చేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటాడు. అందువలన ఇప్పట్లో ఈ ఇద్దరితో అల్లు అర్జున్ ప్రాజెక్టు ఉండకపోవచ్చనే అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బోయపాటి పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బోయపాటి చేస్తున్న 'అఖండ' పూర్తికాగానే, అల్లు అర్జున్ తోనే ఆయన సెట్స్ పైకి వెళతాడని అనుకుంటున్నారు. ఆల్రెడీ అల్లు అరవింద్ ఇచ్చిన అడ్వాన్స్ బోయపాటి దగ్గర ఉందట. గతంలో అల్లు అర్జున్ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సరైనోడు' సూపర్ హిట్ గా నిలిచింది.