కృతి శెట్టి డేట్ల కోసం యంగ్ హీరోల వెయిటింగ్

Admin 2021-05-12 14:55:22 entertainmen
'ఉప్పెన' సినిమాతో కృతి శెట్టి స్టార్ డమ్ అందుకుంది.ఇప్పుడు ఈ అమ్మాయికి ఉన్నంత క్రేజ్ అంతాఇంతా కాదు. అసలు 'ఉప్పెన' సినిమా సెట్స్ పై ఉండగానే నాని సినిమాలోనూ .. సుధీర్ బాబు మూవీలోను కృతి ఛాన్స్ కొట్టేసింది. నితిన్ .. చైతూ .. నిఖిల్ .. నాగశౌర్య వంటి హీరోలు లైన్లో ఉండనే ఉన్నారు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా తేజ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అభిరామ్ ఈ సినిమాతోనే హీరోగా తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కృతి శెట్టిని అడిగారట. అభిరామ్ జోడిగా ఎవరు కనువిందు చేస్తారో చూడాలి మరి.