- Home
- bollywood
ఏడు రోజుల్లో రూ.11,39,11,820 నిధులు : కోహ్లీ, అనుష్క దంపతులు
‘ఇన్ దిస్ టుగెదర్’ పేరుతో వారు ప్రారంభించిన ఈ విరాళాల సేకరణకు మంచి స్పందన వచ్చింది. ఏడు రోజులలో రూ.7 కోట్ల నిధులు సేకరించాలనే లక్ష్యంతో వారు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఐదు రోజులలోనే 7 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో నిధుల సేకరణ లక్ష్యాన్ని రెండు రోజుల క్రితం ఈ దంపతులు రూ.11 కోట్లకు పెంచారు. దీంతో వారం రోజులు ముగిసే సమయానికి ఆ లక్ష్యాన్ని కూడా దాటి రూ.11,39,11,820 నిధులు వచ్చినట్లు కొహ్లీ తెలిపాడు. ఈ మొత్తాన్ని కరోనా రోగులకు సాయం చేస్తున్న 'యాక్ట్ గ్రాంట్స్ అసోసియేషన్'కు అందివ్వాలని వీరు నిర్ణయించుకున్నారు. ఇక తమ పిలుపు మేరకు స్పందించి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నాడు.