- Home
- tollywood
ఎన్టీఆర్ తో బుచ్చిబాబు ప్రాజెక్టు ఖాయమే!
సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు తెలియజేసిన బుచ్చిబాబు, ఆయనతో చేయనున్న సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పాడు. 'లోకల్ స్టోరీని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పి ఒక ట్రెండ్ సృష్టిద్దాం సార్' అంటూ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా ఉందనే వార్తలు ఇంతకుముందే వచ్చాయి. కానీ చాలామందికి నమ్మకం కలగలేదు. ఇప్పుడు ఆ సందేహానికి బుచ్చిబాబు తెర దింపేశాడు.