- Home
- tollywood
కృష్ణ పుట్టినరోజు 'సర్కారువారి పాట' ఫస్టు లుక్!
మహేశ్ బాబు .. పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. బ్యాంక్ కి సంబంధించిన ఒక భారీ స్కామ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. కరోనా ప్రభావం తగ్గితే ఈ సినిమా రెండవ షెడ్యూల్ ను కొనసాగించనుంది. ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఫస్టులుక్ పోస్టర్ ను డిజైన్ చేయించే పనిలో పరశురామ్ ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు లుక్ డిఫరెంట్ గా ఉండనుంది. అందువలన ఆయన అభిమానులు మరింత ఆసక్తిని చూపుతున్నారు. ఈ పోస్టర్ తో మరింతగా అంచనాలు పెరగడం ఖాయమనే నమ్మకంతో వాళ్లు ఉన్నారు.