'పుష్ప'లో అనసూయకు మరో మంచి ఛాన్స్

Admin 2021-05-22 19:49:22 entertainmen
అనసూయ తన జోరు పెంచింది,  వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ వెళుతోంది. ఆమధ్య సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం'లో ఆమె చేసిన 'రంగమ్మత్త' రోల్ ప్రేక్షకులలోకి ఎంతగా దూసుకెళ్లిందో తెలిసిందే. అదే సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న 'పుష్ప' సినిమాలోనూ ఆమెకి మంచి పాత్ర పడింది. అనసూయ ఈ సినిమా షూటింగులో పాల్గొంది కూడా.  రీసెంట్ గా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేద్దామనే నిర్ణయానికి వచ్చారు. ఆ విషయాన్ని నిర్మాతలు స్పష్టం చేశారు కూడా. అనసూయ పాత్ర నిడివిని పెంచుతున్నట్టుగా తెలుస్తోంది. మొదటిభాగంలోను .. రెండవ భాగంలోను ఆమె కనిపిస్తుందన్న మాట. ఒక రకంగా ఇది అనసూయ అదృష్టమేనని అనుకోవాలి. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, బన్నీ చెల్లెలిగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.