పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన : ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్

Admin 2021-05-22 20:21:22 entertainmen
ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ కు పుత్రోదయం అయింది. ఆమె ఇవాళ మధ్యాహ్నం పండంటి మగశిశువుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని శ్రేయా స్వయంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. "దేవుడు మమ్మల్ని ఓ మగబిడ్డతో దీవించాడు. ఇలాంటి ఉద్వేగాన్ని మునుపెన్నడూ చవిచూడలేదు. అభిమానుల అశేష దీవెనలకు కృతజ్ఞతలు" అంటూ శ్రేయా తన పోస్టులో స్పందించారు. శ్రేయాకు భారత సినీ సంగీత ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.