- Home
- tollywood
నేను ఏ స్పెషల్ సాంగ్ లో కనిపించడం లేదు : పాయల్ రాజ్ పుత్
'సీత' సినిమాలో ఆమె చేసిన 'బుల్లెట్టు మీదొచ్చే' ఐటమ్ పాటకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇక ఐటమ్ పాటల్లోను ఆమె ఒక రేంజ్ లో మెరిసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నారు. 'బంగార్రాజు' సినిమాలోనూ ఆమె ఒక ఐటమ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కల్యాణ్ కృష్ణ దర్శకుడిగా నాగార్జున హీరోగా ఈ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాలోని ఒక ఐటమ్ సాంగ్ కోసం పాయల్ ను సంప్రదిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అందుకు పాయల్ స్పందిస్తూ .. "నేను ఏ స్పెషల్ సాంగ్ లో కనిపించడం లేదు' అంటూ స్పష్టం చేసింది.