మహేశ్ మూవీ కోసం త్రివిక్రమ్ సన్నాహాలు

Admin 2021-06-01 20:26:12 entertainmen
త్రివిక్రమ్.. మహేశ్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పనుల్లోనే త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. యాక్షన్ తో కూడిన ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాకి 'పార్థు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కృష్ణ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ వస్తుందని అభిమానులు అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా ఆలస్యమవుతుందేమోననే సందేహం అభిమానుల్లో తలెత్తింది. కానీ వచ్చేనెల నుంచే ఈ సినిమా షూటింగును మొదలుపెట్టే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయట.