పవన్ కల్యాణ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మానస రాధాకృష్ణన్

Admin 2021-06-14 15:17:12 entertainmen
మానస రాధాకృష్ణన్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే తెలుగులో ఇంతవరకూ ఆమె ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ హఠాత్తుగా టాలీవుడ్ లో ఆమె పేరు వినిపించింది. అదీ పవన్ సినిమాకి సంబంధించి కావడంతో, అందరి నోళ్లలో ఆమె పేరు నానుతోంది.పవన్ కల్యాణ్ తో హరీశ్ శంకర్ ఒక సినిమాను చేయనున్నాడనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.నేపథ్యంలోనే తాజాగా 'మానస రాధాకృష్ణన్' అనే మలయాళ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. దాంతో ఈ విషయంపై ఆమెనే నేరుగా స్పందించింది. "నాకు పవన్ కల్యాణ్ గారు అంటే చాలా ఇష్టం .. కానీ ఆయన సినిమాలో నేను చేయడం లేదు" అని ఆమె క్లారిటీ ఇచ్చింది.