నా‌ మనసుకు నచ్చిన సినిమాలే చేస్తుంటా : శ్రుతిహాసన్

Admin 2020-09-07 18:32:41 entertainmen
మరొకరి అంచనాలు, ఇష్టాల‌కు తగినట్లుగా త‌న‌ జీవితాన్ని కొన‌సాగించలేనని, త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లు జీవితాన్ని గ‌డుపుతాన‌ని హీరోయిన్ శ్రుతి హాస‌న్ చెప్పింది. తాజాగా, ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ...త‌న కెరీర్‌ విషయంలో ఎవరి సలహాలు తీసుకోనని చెప్పింది. త‌న ఆత్మసాక్షి ప్ర‌కార‌మే నడచుకుంటాన‌ని తెలిపింది. త‌న‌ మనసుకు నచ్చిన సినిమాలే చేస్తుంటానని చెప్పింది. ముంబయిలో పరిస్థితులు విచిత్రంగా ఉంటాయని, ఒక‌వేళ ఏడాది పాటు ఖాళీగా ఉంటే కెరీర్‌ ముగిసిపోయిందని అనుకుంటార‌ని చెప్పింది. న‌టులు అంకితభావంతో పనిచేయడం లేదని విమర్శలు చేస్తారని తెలిపింది. తాను ప‌లు భాషల్లో సినిమాలు చేస్తున్నానని, బాలీవుడ్‌ అందులో ఒకటి మాత్రమేన‌ని చెప్పింది.